టిడిపిలోకి పసుపాం మాజీ సర్పంచ్‌

Jan 27,2024 20:38

ప్రజాశక్తి -పూసపాటిరేగ : మండలంలోని పసుపాం మాజీ సర్పంచ్‌, వైసిపి నాయకుడు కంది వెంకటరమణ శనివారం ఐదుగురు వార్డు సభ్యులు సహా 100 కుటుంబాలతో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టిడిపి మండల అధ్యక్షలు మహంతి శంకరావు అధ్వర్యంలో మాజీమంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు సమక్షంలో నెల్లిమర్ల ఇంచార్జి కర్రోతు బంగారాజు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆవ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి వెళ్లిన మాజీ సర్పంచ్‌ కంది వెంకటరమణ మాట్లాడుతూ టిడిపితోనే ఈ రాష్ట్రా నికి ప్రజలకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతో వైసిపిని వీడి టిడిపిలోకి వెళ్తున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో వార్డు మెంబర్లు బండారు రమణమ్మ, పతివాడ కనకరత్నం, చింతపల్లి అప్ప య్యమ్మ, లెంక నారాయణప్పడు, వాళ్లే చిన్నం నాయుడులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిిపి రాష్ట్ర కార్యదర్శిలు మహంతి చిన్నంనాయుడు, పతివాడ తమ్మునాయుడు, డెంకాడ మాజీ ఎంపిపి కంది చంద్రశేఖరావు, నాయకులు పతివాడ అప్పల నారాయణ, కర్రోతు సత్యనారాయణ, ఆకిరి ప్రసాద్‌ రావు, విక్రం జగన్నాదం, పిన్నింటి సన్యాసినాయుడు, పసుపులేటి గోపి, వెంపడాపు సూర్యనారాయణ, ఇజ్జురోతు ఈశ్వర్రావు, పిన్నింటి శ్రీనివాసరావు, గేదెల రాజారావు, మాజీ సర్పంచ్‌ తమ్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️