టిడిపిలోనే బిసిలకు ప్రాధాన్యం

ప్రజాశక్తి-కురిచేడు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బిసిలకు అత్యధిక ప్రాధాన్యత లభించిం దని, అలాంటి ప్రాధాన్యత మళ్లీ కావాలంటే టిడిపిని అధికారం లోకి తేవాల్సిఉందని, టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం అన్నారు. గురువారం స్థానిక పోలేరమ్మ గుడివద్ద జరిగిన టిడిపి జయహో బిసి సభలో ఆయన ప్రసంగించారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ చేసిన అభివృద్ధి ఏమీలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలను తీసివేశారని అన్నారు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా బిసిలను మోసం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని అన్నారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకొని చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పిడతల నెమలయ్య, నియోజకవర్గ బిసి సెల్‌ అధ్యక్షులు మోడి వెంకటేశ్వర్లు, డాక్టర్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ సునీల్‌, బిసి నాయకులు బొనిగల అంకయ్య, పిక్కిలి చెన్నయ్య, మర్రి సుబ్బారావు, పూల శ్రీను, తాటిమట్ల వెంకటేశ్వర్లు, ఆలా గోవిందు, పామిశెట్టి వేమయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️