టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-ముండ్లమూరు : రాజంపల్లి వైసిపి మాజీ సర్పంచి వజ్జా నారాయణమ్మ కుటుంబం తమ అనుచరులతో కలసి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలో చంద్రబాబు సమక్షంలో శనివారం టీడీపీలో చేరారు. తూర్పు వెంకటాపురం పిఎసిఎస్‌ మాజీ చైర్మన్‌ వజ్జా శ్రీనివాసరావు, రాజంపల్లి వైస్‌ సర్పంచి వజ్జా నాగమణి, వారి అనుచరులు సుమారు 120 కుటుంబాల వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

➡️