పరువు సీజన్‌-2 కోసం ఎదురుచూస్తున్నా : చిరంజీవి

Jun 20,2024 20:00 #Megastar Chiranjeevi, #movies

నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ పరువు. ఈనెల 14న ఓటీటీకి వచ్చింది. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విష్ణుప్రసాద్‌ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సిరీస్‌పై చిరంజీవి ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ‘పరువు సీజన్‌-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఓ చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, ఈ విషయమై ఎమ్మెల్యే పాట్లు. చివరికి ఈ జంట తప్పించుకుందా? లేదా అనే విషయమై తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంది.’ అంటూ కొనియాడారు. ప్రణీత పట్నాయక్‌, బిందు మాధవి, మిత్‌ తివారి కీలకపాత్రలు పోషించారు.

➡️