టిడిపిలో చేరిన నల్లమల్లి బాలు

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఒంగోలు నగరానికి చెందిన వైసిపి ఆర్యవైశ్య నాయకులు నల్లమల్లి బాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక టిడిపి కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు నల్లమల్లి బాలుకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు సుమారు 150 మంది అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని దామచర్ల జనార్ధనరావు కోరారు. కార్యక్రమంలో టిడిపి ఒంగోలు నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, మిరియాల కృష్ణమూర్తి, పల్లపోతు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️