టిడిపి, జనసేనతో మెరుగైన పాలన

Dec 25,2023 21:31

ప్రజాశక్తి – నెల్లిమర్ల :  టిడిపి, జనసేనతో మెరుగైన పాలన జరుగుతుందని జన సేన నియోజక వర్గం ఇంఛార్జి లోకం మాధవి అన్నారు. ఆదివారం రాత్రి అలుగోలులో జనసేన మన ఊరిలో జనవాణి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మెరుగైన పరిపాలన కావాలంటే అది జనసేన, టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి పవన్‌ కళ్యాణ్‌ ఎంత అవసరమో వివరించారు. ప్రభుత్వం యంత్రాంగం తీరు కూడా బాగోలేదన్నారు. ఇంత అరాచకమైన ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేయకూడద చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అమూల్యమైన ఓటును జనసేన పార్టీ గాజు గ్లాస్‌ గుర్తుపై వేయాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్‌ నాయకులు కరుమజ్జి గోవింద్‌, ఆల్తి రామచంద్ర, ఆల్తి శ్రీను, బద్రి, తాతబాబు, వేణు, బాలాజీ, సుగుణ మారుతి నాయుడు, రెల్లి సత్యనారాయణ, చందక సాయి, కొంచాడ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️