టిడిపి జెండా రెపరెపలాడాలి..

Jan 2,2024 22:12
మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ

మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ
టిడిపి జెండా రెపరెపలాడాలి..
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కషిచేసి టిడిపి జెండాను రెపరెపలాడించాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని నారాయణ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయా డివిజన్ల నాయకులతో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ, క్షేత్రస్థాయిలో ఓటర్ల వెరిఫికేషన్‌, రానున్న ఎన్నికల్లో చేపట్టాల్సిన విధివిధానాలపై క్షుణ్ణంగా చర్చించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు నారా చంద్రబాబు గ్యారెంటీ అని చెప్పారు. ప్రజలందరి ఆధరణతో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తిరుగులేని విజయం సాధించి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. ఇందుకు ప్రతికార్యకర్త తమవంతుగా శక్తివంచన లేకుండా పని చేసి టీడీపీ విజయానికి కషి చేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు షేక్‌ కరిముల్లా, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్‌పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు..తదితరులు పాల్గొన్నారు.

➡️