టైలర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

 అమరావతి: టైలర్స్‌ డే సందర్భంగా మండల కేంద్రమైన అమరావతిలో అమరావతి పట్టణ టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనం తరం తల్లం బ్రహ్మయ్య స్మారక భవనంలో టైలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు షేక్‌. హుమాయున్‌ ఆధ్వర్యంలో కేకులు కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సం దర్భంగా హుమాయున్‌ మాట్లాడుతూ మండలంలో టైలర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అసోసియేషన్‌ పనిచేస్తుందని చెప్పారు. నేటి ఆధునిక ప్రపంచంలో రెడీమేడ్‌ రంగంలో ప్రజలు ఆకర్షణ చూపడంతో టైలర్ల భవిష్యత్తు అగమ్య గోచారంగా మారి కుటుంబాల పోషణ కరువై దుర్భర స్థితిని అనుభవి స్తున్నారన్నారు. టైలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అసోసియేషన్‌ నాయకులు గుబ్బ శ్రీనివాసరావు, షేక్‌ షబ్బీర్‌, బాజీ, జాన్‌ సైదా పాల్గొన్నారు.

 అచ్చంపేట : అచ్చంపేట మండలం టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక రామాలయం సెంటర్‌లో టైలర్స్‌ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా అచ్చంపేట వీధుల్లో టైలర్లు ర్యాలీగా ఆర్‌ అండ్‌ బి బంగ్లా చేరుకున్నారు. అనంతరం సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులుగా తిరువాయి పాటి ఆంజ నేయులు మాట్లాడుతూ టైలర్స్‌ కు కాంప్లెక్స్‌ భవనం నిర్మాణం గురించి గత కొన్నేళ్లుగా ప్రజా ప్రతినిధులను కలసి అర్జీలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఎంతోమంది మహిళలు టైలర్‌ వృత్తిని నమ్ముకొని జీవనోపాధిని పొందుతున్నా రన్నారు. టైలర్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసి సబ్సిడీపై రుణాలు ఇచ్చి వాళ్ళ జీవనోపాధి కి దోహదపడాలని కోరారు. అనంతరం అచ్చం పేట మండలం టైలర్ల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందె పోగు గాంధీని నూతన అధ్య క్షునిగా ఎన్ను కున్నారు. సీనియర్‌ టైలరు ఎస్‌ కె సైదు లను ఘనంగా సత్క రించారు. కార్య క్రమంలో పాల్గొన్న టైలర్స్‌ ఎస్కే హస్సేన్‌ కొంపల్లి బాలస్వామి, కె.కిరణ్‌ ఎస్‌.కె మౌలాలి, చిలక విజరు, తిరువాయి పాటి హరికృష్ణ, చందలూరి గురునాథం, మహిళా టైలర్లు పాల్గొన్నారు.

 సత్తెనపల్లి రూరల్‌ : జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజానికి ఏదోరకంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సత్తెనపల్లి రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఎం.ఆదినారాయణ అన్నారు.  క్యాలిబర్‌ జానీ సహాయసహకారాలతో అమ్మ చేయూత చారిటబుల్‌ సొసైటీ ఆధ్వ ర్యంలో సత్తెనపల్లిలోని వివిధ వార్డులకు చెందిన నిరుపేద మహిళలకి బుధవారం చీరలు పంపిణీ చేశారు. సత్తెనపల్లి అర్‌ఐ ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత, మహిళలకి స్వయం శక్తితో ఎదిగే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం ఆది నారాయణను ట్రస్ట్‌ సభ్యులు సత్క రించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ అధ్యక్షులు కె.దస్తగిరి,ట్రస్టు సభ్యులు పి.ప్రకాష్‌రావు, పి.రత్తయ్య, జి.గోవిందు, ఎస్‌.కోటేశ్వర రావు పాల్గొన్నారు ప్రజాశక్తి-మాచర్ల్ల నూతనంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికను అందిపుచ్చుకోని టైలర్స్‌ అభివృద్ది చెందాలని సీనియర్‌ రొటేరియన్‌ డాక్టరు కె.రామకోటయ్య అన్నారు. పట్టణంలోని మెడికల్‌ అసో సియేషన్‌ హాల్‌లో రోటరి క్లబ్‌ ఆధ్వర్యంలో పఠాన్‌ బుడే సాహెబ్‌ జ్ఞాప కార్దం టైలర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ టైలర్లు మద్దోజు కోటయ్య, మోద డుగు విజయలక్ష్మీ, అల వాల వెంకటేశ్వర్లు, తాటిపర్తి శేషారెడ్డి, అత్తరు సుభాని, రెబ్బల పలిల భాస్కర రావులను క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని సత్యనారాయణ, పఠాన్‌ నాగూర్‌వలి ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ గవర్నర్‌ శంకర్‌, క్లబ్‌ ప్రతి నిధులు, టైలర్స్‌ యూని యన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

టైలర్ల సమ స్యల గురించి కృషి చేస్తానని సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ హామీ ఇచ్చారు. టైలర్స్‌ డే సం దర్భంగా బుధవార సత్తెనపల్లి లోని మన్నెం రెసిడెన్సీ లో టైలర్ల కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసం గించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లా డుతూ టిడిపి అధికారంలోకి వస్తే టైలర్స్‌కు అసోసియేషన్‌ భవనాన్ని నిర్మి స్తానని వారికి హామీ ఇచ్చారు. కార్య క్రమంలో. టైలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు షేక్‌ సైద, టైలర్స్‌ శివప్రసాద్‌, రఫీ,అంకారావు టిడిపి కార్యనిర్వాక కార్య దర్శి యెలినేడి రామ స్వామి రాష్ట్ర కార్య దర్శి చౌట శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 వినుకొండ: టైలర్ల కుటుంబాలకు శివశక్తి లీలా అండ్‌ అంజన్‌ ఫౌండేషన్‌ అండగా ఉం టుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవీ ఆంజనేయులు భార్య, శివశక్తి ఫౌండేషన్‌ చైర్మన్‌ గోనుగుంట్ల లీలావతి అన్నారు. టైలర్స్‌ డే సందర్భంగా స్థానిక ఏనుగుపాలెం రోడ్డులోని మసీదు మన్యంలో టైలర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సభకు ఆమె ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ముందుగా కుట్టు మిషన్‌ కనుగొన్న శాస్త్రవేత్త ఐజాక్‌ మెరిట్‌ సింగర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ టైలర్లలో అధిక శాతం కుటుంబాలు పేద రికంలో మగ్గుతూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. టిడిపి జనసేన సంయుక్త ప్రభుత్వం రాగానే ఇల్లు లేని పేద దర్జీలకు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో నివాస గృహాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. విద్యను అభ్యసించే దర్జీల పిల్లలు స్కాలర్షిప్లు అందజేస్తామని తెలి పారు.జూనియర్‌ టైలర్లకు శిక్షణ ఇవ్వాలని, తర్ఫీదు సమయంలో అయ్యే ఖర్చు ఫౌండేషన్‌ భరాయిస్తుందని, అసో సియేషన్‌ పెద్దలు ముందుకు రావాలని కోరారు. అనంతరం మహిళ దర్జీ షేక్‌ ఆయుషాకు టిడిపి యువ నాయకులు షేక్‌ జానీ ఏర్పాటు చేసిన కుట్టు మిషన్‌ ను లీలావతి అందజేశారు. కార్య క్రమంలో టిడిపి నాయకులు షమీంఖాన్‌, పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయుబ్‌ ఖాన్‌, పివి. సురేష్‌ బాబు, అక్బర్‌ బాషా, అజంతా టైలర్‌ బాబు, ఇస్మాయిల్‌, ఎమ్మెస్‌ టైలర్‌ సైదా తదితరులు పాల్గొన్నారు.

➡️