డబుల్‌ ఎంట్రీలపై చర్యలు తీసుకోండి

మాచర్ల : స్ధానిక తహశీల్ధార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్నికల నియమనిబంధనలపై రాజకీయ పార్టీల ప్రతినిధు లకు సోమవారం అవగాహన కార్యక్రమం జరి గింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి జూలకంటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గ పరిధిలో ఓటర్ల జాబితాలో ఉన్న డబుల్‌ ఎం ట్రీలపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలి పారు. వాటిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. బిజెపి నియోజకవర్గ కన్వీనర్‌ గుమ్మడి నాసరయ్య మాట్లాడుతూ వాలెంటీర్ల వద్ద ఉన్న సంక్షేమ పధకాల లబ్దిదారుల వాట్సఫ్‌ గ్రూప్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా చర్యలు తీసు కోవాలని కోరారు. అటువంటి ప్రచారాలుంటే ఆధా రాలతో ఫిర్యాదు చేయాలని ఆర్‌ఓ శ్యామ్‌ ప్రసాదు సూచించారు. ఈ సందర్భంగా శ్యామ్‌ ప్రసాదు ఆయా పార్టీల నాయకులతో మాట్లాడుతూ ఎన్ని కలు ప్రశాంతంగా జరిపేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున నియమావళికి లోబడి ప్రచారం నిర్వహించుకోవా లన్నారు.

➡️