డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలకు నిరుద్యోగుల ఆందో ళన

Jan 30,2024 21:04

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   ప్రభుత్వం దాట వేత ధోరణి మానుకొని డిఎస్‌సి నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జెఎసి డిమాండ్‌ చేసింది. జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కోట జంక్షన్‌ వద్ద నిరుద్యోగులు పెద్దఎత్తున నిరసన ధర్నా,రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జెఎసి రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్దిక్‌, కో కన్వీనర్‌ పవన్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షనేతగా పాదయాత్ర సమయంలో అధికారం లోకి వచ్చిన తర్వాత 25వేల పోస్టులతో మెగా డిఎస్‌సి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఐదేళ్లయినా డిఎస్‌సి ప్రకటన చేయలేదని, అన్నారు. ముఖ్యమంత్రి చేతిలో మోసపోయి నిరుద్యోగులు రోడ్లు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింద న్నారు. మంతి బొత్స ఈరోజు, రేపు అంటూ నోటిఫికేషన్‌ రాకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. తప్పు దోవ పట్టించడం మానుకొని తక్షణమే 23వేల పోస్టులుభర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయకపోతే మంత్రులు, ప్రజాప్రతి నిధులను రోడ్లు మీదకు రానివ్వబోమని, వారి ఇళ్లు ముట్టడిస్తామని, ఎన్నికల ప్రచారానికి రానీయకుండా చేస్తామని హెచ్చరించారు.

➡️