తప్పుల్లేని ఓటరు జాబితాను సిద్దం చేయండి :టిడిపి

ప్రజాశక్తి- వీరబల్లి : టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు మండలంలోని సానిపాయి గ్రామంలో బూత్‌ నెంబర్‌ 233,234 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. బిఎల్‌ఒల దగ్గర ఉన్న ఓటరు లిస్టును అయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ డ్రాఫ్ట్‌ ఓటరు లిస్టును పరిశీలించుకుని అభ్యంతరాలు ఉంటే ఈ ప్రత్యేక శిబిరాలలో తెలియచేసి సరి చేసుకోవాలని తెలిపారు. 2024 జనవరి,1 తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతను ఓటునమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు భానుగోపాల్‌రాజు, సీనియర్‌ నాయకులు జయరామ్‌యాదవ్‌, తెలుగు యువత పార్లమెంట్‌ కార్యదర్శి నేతిరమేష్‌ బాబు, చలపతినాయుడు, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తప్పుల్లేని ఓటర్‌ జాబితాను సిద్ధం చేయాలని టిడిపి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్‌.జె వెంకటేష్‌ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 2, 3వ తేదీలలో నిర్వహించిన ఓటర్‌ లిస్టు వెరిఫికేషన్‌ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిమ్మనపల్లి మండలంలోని రాచవేటివారి పల్లి గ్రామానికి సంబంధించిన పోలింగ్‌ బూతులు 199, 200, 201 కి సంబంధించిన ఓటర్‌ లిస్టులను రాజంపేట పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌.జె వెంకటేష్‌, బూత్‌ ఇన్‌ఛార్జి శంకరతో కలిసి పరిశీలించారు. 201వ పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన ఓటర్‌ లిస్టు ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా లేదని చెప్పారు. ఓటర్‌లిస్ట్‌లో ఓట్లు క్రమ పద్ధతిలో లేకుండా ఉన్నాయని, ఊరు మరియు ఇంటి నెంబర్ల వారీగా సరిచేయాలని ఇదివరకే నిమ్మనపల్లి తహసిల్దార్‌ దష్టికి తీసుకెళ్లామన్నారు. తహసిల్దార్‌ మంజుల ఫారం-8 ద్వారా వాటిని క్రమ పద్ధతిలో సరి చేస్తామని, ఇంతవరకు సరి చేయలేదన్నారు. 201 దిగువమాచిరెడ్డిగారిపల్లి పోలింగ్‌ బూత్‌ బిఎల్‌ఒకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి ముసాయిదా ఓటర్‌ లిస్టును సరిచేయాలని అన్నారు. దొంగఓట్లు నమోదుపై టిడిపి పోరాటం చేస్తుందని, ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మేరకు తప్పులు లేని ఓటర్‌ లిస్టును అధికారులు సిద్ధం చేయాలని కోరారు.గాలివీడు: డిసెంబర్‌ 9న ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తవుతుందని తహశీల్దార్‌ దైవాదీనం పేర్కొన్నారు. జనవరిలో కొత్త జాబితా ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఆదివారం పిఎస్‌ 186 బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్‌ బూత్‌లో 917 ఓట్లు ఉండగా అందులో ఇప్పటికి చనిపోయిన వారిని, గ్రామంలో లేని వారి పేర్లు తొలగించినట్లు తెలిపారు. ఆదివారం 16 ఓటర్ల నమోదు అయినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బిఎల్‌ఒలు వెంకటేశ్వర్లు, విఆర్‌ఎలు పాల్గొన్నారు.

➡️