తమ్ముడ్ని హతమార్చిన అన్న

Feb 10,2024 21:46

ప్రజాశక్తి – పాచిపెంట :  ఆస్తి కోసం సోదరుడ్ని అతి కిరాత కంగా హతమార్చిన సంఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని గడివలసకు చెందిన కోరాడ జోగేశ్వరరావు (44), కోరాడ నర్సిం హులు అన్నదమ్ముల పిల్లలు. ఈ రెండు కుటుంబాల మధ్య గత ఐదారేళ్లుగా భూతగాదాలు జరుగుతున్నాయి. దీంతో వీరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కోరాడ జోగేశ్వరరావు శనివారం సాయంత్రం తన పొలంలో పనులు చేసుకుంటున్నాడు. ఒంటరిగా ఉన్న జోగేశ్వరరావును అదును చూసుకొని నర్సింహులు అతని పీక, మర్మాంగాలను కొడవలితో కోయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే నర్సింహులు స్థానిక పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు నర్సింహులతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఈ సంఘటనలో ఉన్నట్టుగా భావిస్తూ పోలీసులు ఆరా తీసుకున్నారు. జోగేశ్వరరావు భార్య గౌరమ్మ, కుమార్తె గుణావతి, కుమారుడు లీలా ప్రసాద్‌ ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పార్వతీపురం ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌, సాలూరు సిఐ బాలకృష్ణ, పాచిపెంట ఎస్‌ఐ పి.నారాయణరావు, సిబ్బంది, డాగ్‌స్క్వేడ్‌ చేరుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సిహెచ్‌సికి తరలించారు.

➡️