తహశీల్దారును సస్పెండ్‌ చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి-బి.కొత్తకోట రికార్డులు తారుమారు చేసి భూకబ్జాదారులకు బాసటగా నిలుస్తున్న బి.కొత్తకోట తహశీల్దార్‌ రఫిక్‌ అహ్మద్‌ను సస్పెండ్‌ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని గోళ్లపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు 427-బి-2బిలో ఉన్న 2.27 ఎకరాల భూమిలో సిపిఎం ఆధ్వర్యంలో చెట్లు కొట్టి సాగుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 మంది భాగస్తులు ఉన్న సర్వే నెంబరు 427బి2బిలో దొంగ 1బి సష్టించి పేదల మద్య విభేదాలు స ష్టించిన రెవెన్యూ అధికారుల వైఖరిని ఖండించారు.భూ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే సమస్యలకు కారణమయితే సామాన్యులు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.బాధితులకు అండగా సిపిఎం ఉంటుందని అందులో భాగంగానే భూపోరాటం చేస్తున్నట్లు వివరించారు. గొల్లపల్లి రెవెన్యూ గ్రామంలో 1273 ఖాతా నెంబరు సురేంద్ర అనే అతనికి ఉన్నప్పటికీ అదే ఖాతా నెంబరుతో తప్పుడు పద్ధతుల్లో 1బిని పెద్ద కోనప్ప పేరుతో సష్టించిన తహశీల్దార్‌ను సస్పెండ్‌ చేసేవరకు పోరాటం చేస్తామని, అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి రికార్డులు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో గంగాధర్‌, వీరప్ప, శంకర, శ్రీనివాసులు, మల్లికార్జున రెడ్డెప్ప, నరేష్‌, గంగాదేవి, లక్ష్మిదేవి, సరస్వతి, సుజాత పాల్గొన్నారు. సాగు భూమిలో కంపచెట్లు తొలగిస్తున్న సిపిఎం నాయకులు, ప్రజలు

➡️