తీరం జోలికొస్తే ఖబడ్దార్‌

మంగమారిపేట మత్యకారులు

– మంగమారిపేట వద్ద మత్స్యకారుల ఆందోళన

ప్రజాశక్తి -భీమునిపట్నం : తమ ఉపాధికి కేంద్రంగా ఉన్న సముద్రం, తీర ప్రాంతాన్ని ఏ ఒక్కరైనా కబళించాలని ప్రయత్నిస్తే ఖబడ్దార్‌ అంటూ జివిఎంసి నాలుగో వార్డు మంగమారిపేట మత్యకారులు తీవ్రంగా హెచ్చరించారు. సిఆర్‌జెడ్‌ నిబంధనలు ఉల్లంఘించి తీర ప్రాంతంలో రాతి కట్టడాలకు కొంతమంది బడాబాబులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ శుక్ర వారం సాయంత్రం నిరసన చేపట్టారు. తాత ముత్తాతల నుంచి మంగమారిపేట తీరంలో బోట్లు, వేట సామగ్రి నిలుపుకుని, ఇక్కడి నుంచేపలు గ్రామాల మత్స్యకారులు చేపల వేేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారని మత్స్యకార నాయకులు సిహెచ్‌ అమ్మోరు, వాసుపల్లి నూకరాజు, దూడ అచ్చారావు, వాసుపల్లి నల్లబాబు, వాసుపల్లి గరగయ్య తదితరులు వివరించారు. ఏటా జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఇక్కడ సముద్రం ముందుకు వస్తుందని, దీంతో ఒడ్డున ఉన్న బోట్లు, పడవలు, వేట సామగ్రికి రక్షణ కష్టమవుతుందన్నారు.భీమిలి మండలానికే ఫిష్‌ మార్కెటింగ్‌ కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం బడాబాబుల హస్తగతమైతే మత్స్యకారుల బతుకులేం కావాలని ఆవేదన వ్యక్తంచేశారు.శాశ్వత కట్టడాలకు ఇప్పటికే సేకరించిన బండరాళ్లు, గ్రావెల్‌ను వెనక్కు తీసుకుపోకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

మంగమారి పేట తీర ప్రాంతంలో మత్యకారుల ఆందోళన

➡️