తుపాన్‌ సాయం అందజేయాలి

Dec 16,2023 19:06
తుపాన్‌ సాయంపై చర్చిస్తున్న రంగారెడ్డి

తుపాన్‌ సాయంపై చర్చిస్తున్న రంగారెడ్డి
తుపాన్‌ సాయం అందజేయాలి
ప్రజాశక్తి – నెల్లూరు అర్బన్‌
మిచౌంగ్‌ తుఫాను సాయంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డితో ఎంపి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి చర్చించారు. శనివారం నెల్లూరు జిల్లా జెడ్‌పి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో రంగారెడ్డి పాల్గొన్నారు. జెడ్‌పి జనరల్‌ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కూర్మానాథ్‌లతో రంగారెడ్డి చర్చించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం అందాల్సిన తుఫాను సాయంను తక్షణమే విడుదల చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేపట్టాలని మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి జెసికి సూచించారు.

➡️