తొమ్మిది మందికి గాయాలు

ప్రజాశక్తి-శింగరాయకొండ : కారు అదుపుతప్పి ఆటో, టివిఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనాన్ని ఢకొీన్న ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన లారీ యూనియన్‌ ఆఫీస్‌, జివిఆర్‌ ఫ్యాక్టరీ మధ్యలో రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. ఉలవపాడు మండలం అలగాయపాలెం గ్రామానికి మహిళలు ఫ్యాక్టరీలో పనికోసం ఆటోలో వస్తున్నారు. అదే సమయంలో ఆటోను కారు ఢకొీంది. దీంతో జాన్‌, వలి, వంశి, అభిలాష్‌ , లక్ష్మి, రమణమ్మ, మరియమ్మ, రాణి, స్రవంతి అనే వారికి గాయాల య్యాయి. క్షతగాత్రులను 108 వాహనం, హైవే అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌ కు తరలించారు. కారు టివిఎస్‌ ఎక్సెఎల్‌ వాహనాన్ని ఢకొీన్న ఘటనలో శింగరాయకొండకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. హైవే మొబైల్‌ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎస్‌ఐ టి. శ్రీరామ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.

➡️