దివాన్‌ చెరువు కూడలిలో నమూనా ఇవిఎం

దివాన్‌ చెరువు కూడలిలో నమూనా ఇవిఎం

ప్రజాశక్తి-రాజానగరంనియోజక వర్గం పరిధిలో దివాన్‌ చెరువు వద్ద నమూనా ఇవిఎం స్క్రీన్‌ను కలెక్టర్‌ కె.మాధవీలత మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ ద్వారా మనకు ఓటు హక్కు కల్పించారన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటరుగా నమోదు కావాల్సి ఉందన్నారు. ఓటు హక్కు కలిగిన వారు తప్పనసరిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మనలను పాలించే ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం మనకు ఉందన్నారు. ఓటురుగా నువ్వు ఉంటే దేశం నీ వెంటే అనే నినాదంతో స్వీప్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా నమూనా ఇవిఎంను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కలెక్టర్‌ వెంట రాజానగరం నియోజకవర్గ ఇఆర్‌ఒ, రాజమండ్రి ఆర్‌డిఒ ఎ.చైత్ర వర్షిణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️