దున్నపోతుకు అంగన్‌వాడీల వినతి

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు పలు చోట్ల దున్నపోతులకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఒంగోలు, టంగుటూరు పొదిలి, కొండపి, మర్రిపూడి, కంభం, కనిగిరి తదితర ప్రాజెక్ట్‌ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలియజేశారు. అంగన్‌వాడీల సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియజేశారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించని ప్రభుత్వ తీరును ఖండిస్తూ దున్నపోతు వేషంలో మహిళలు నిలబడగా అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఒంగోలు నగర ఉపాధ్యక్షుడు దామా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని, అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జివి.కొండారెడ్డి సిఐటియు ఒంగోలు నగర కార్యదర్శి టి.మహేష్‌, యూనియన్‌ నాయకులు కెవి.సుబ్బమ్మ, హేమీమా, జ్యోతి, ప్రశాంతి, నిర్మల, పద్మ పాల్గొన్నారు. యర్రగొండపాలెం : అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరిం చాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు కల్పన డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపుతామనిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు మల్లేశ్వరి, సుభాషిణి, నాగ మల్లేశ్వరి, అరుణ కుమారి, సుజాత, రోజా, సుబ్బలు, సునీత, అరుణ, జయమ్మ, నాగరాజుకుమారి, సుబ్బులు తతితరులు పాల్గొన్నారు. వెలిగండ్ల : అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టిడిపి నాయకులు కోరారు. అంగన్‌వాడీల సమ్మెకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, టిడిపి ఉపాధ్యక్షుడు మోటాటి వెంకట సుబ్బారెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు కర్నాటి భాస్కర్‌రెడ్డి, తెలుగు రైతు మండల అధ్యక్షుడు మీనుగ కాశయ్య, అక్కి శ్రీనివాసరెడ్డి, సందడి మస్తాన్‌రెడ్డి,టిడిపి ఎస్‌సి సెల్‌ మండల అధ్యక్షుడు గోన వెంకటయ్య, తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి కేలం చంద్రశేఖర్‌రెడ్డి, సిఐటియు నాయకుడు రాయల మాలకొండయ్య పాల్గొన్నారు. కొండపి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు దున్నపోతుకు వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.వందనం, అంగలకుర్తి బ్రహ్మయ్య, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. పెద్దదోర్నాల :అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డికెఎం.రఫి కోరారు. సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు షేక్‌ ముంతాజ్‌, సుబ్బమ్మ, వెంకటలక్ష్మి, భారతి, ధనలక్ష్మి, మేరికుమారి, కాశీశ్వరి పాల్గొన్నారు. మద్దిపాడు : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు దున్నపోతుకు వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బంకా సుబ్బారావు, ఉబ్బా ఆదిలక్ష్మి, అంగన్‌వాడీ ప్రాజెక్టు యూనియన్‌ అధ్యక్ష కార్యద ర్శులు నాతాని ధనలక్ష్మి, జయప్రద, రమాదేవి, వెంకటసుబ్బమ్మ,రజిని పాల్గొన్నారు.పొదిలి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు దున్నపోతుకు అర్జీ అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. దర్శి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు రాస్తారోకో చేపట్టారు. అనంతరం దున్నపోతుకు అర్జీ అందజేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు అచ్చమాంబ, బాలమ్మ, నాగజ్యోతి, ప్రశాంతి, సుజాత, అజిత, లక్ష్మీ, ఫాతిమా, ఉప్పు నారాయణ, మోహన్‌రావు, సందు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కంభం : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం బుధవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్‌ షేక్‌ అన్వర్‌ బాషా, సిఐటియు మండల కార్యదర్శి షేక్‌ ఖాజావలి, సిపిఎం నాయకులు దానం, కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల అంగన్‌వాడీలు పాల్గొన్నారు. హనుమంతునిపాడు : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు దున్నపోతుకు వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ ప్రాజెక్టు యూనియన్‌ నాయకురాలు ఎక్కంటి రాధమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిన అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నిర్వహిస్తున్న కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆది,పద్మావతి, సుధారాణి, దమ్ము పద్మావతి, నారాయణమ్మ, లలితమ్మ, సౌజన్య పాల్గొన్నారు. కనిగిరి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు దున్నపోతుకు వినతి పత్రం అందజేసిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసి.కేశవరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీల సమస్యలు పట్టని వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సుజాత, సీత, రజిని, భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, సౌందర్య, రామ సుబ్బులు, డివైఎఫ్‌ఐ నాయకులు నరేంద్ర, ఐద్వా నాయకులు షేక్‌ బషీరా, శాంత కుమారి, ప్రసన్న పాల్గొన్నారు. పొదిలి : అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జివి. కొండారెడ్డి డిమాండ్‌ చేశారు. మరిపూడిలో అంగన్‌వాడీలు 21వ రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. సిఐటియు నాయకుడు ఎం. రమేష్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️