నగరపాలక స్టాండింగ్‌ కమిటీ సమావేశం

Feb 7,2024 22:02

నగరపాలక స్టాండింగ్‌ కమిటీ సమావేశం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సమావేశం బుధవారం నగరపాలక కార్యాలయంలో నగర మేయర్‌ ఎస్‌.అముద అధ్యక్షతన జరిగింది. కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌, ఆర్‌జి.శ్రీకాంత్‌, సహదేవన్‌ పాల్గొన్నారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో నగరపాలక సంస్థకు సంబంధించిన కూరగాయల మార్కెట్లు, జంతు వథశాల, ఎన్టీఆర్‌ బస్టాండ్‌, కాసు బ్రహ్మానందరెడ్డి బస్టాండ్‌లకు సంబంధించి 2024- 25 సంవత్సరానికి బహిరంగ వేలం నిర్వహించుటకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించడానికి ఆమోదించారు. ఈసమావేశంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఎంఈ గోమతి, ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, ఏసిపీ రామకష్ణుడు, మేనేజర్‌ ఉమామహేశ్వర్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️