నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Mar 29,2024 23:12

తనిఖీలు చేస్తున్న స్క్వాడ్‌ బృందాలు
ప్రజాశక్తి-గుంటూరు :
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు విధిగా పాటించాలని, సమావే శాలకు, ర్యాలీలకు రిటర్నింగ్‌ అధికారి నుండి అనుమతులు పొందాలని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. నిబందనలు ఉల్లంఘిచిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ఎంసిసి, ఎఫ్‌ఎస్టి, ఎస్‌ఎస్టీ, విఎస్టీలు విస్తృతంగా పర్యటి స్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నా మని, రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవ హరిస్తూ సహకరించాలని కోరారు. ఇప్పటికే 24 గంటలు అందుబాటులో ఉండేలా 3 మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, షిఫ్ట్‌కి 3 బందాలుగా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, స్టాస్టిక్‌ సర్వ్లెన్స్‌, వీడియో సర్వెలైన్స్‌ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బృందంలో గెజిటెడ్‌ ఉద్యోగి పర్యవేక్షణలో పోలీ సులు, వీడియోగ్రాఫర్లు ఉంటారన్నారు. ఆయా బృందాల విధులను పర్యవేక్షణ, రిపోర్టింగ్‌ కోసం జిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా సీనియర్‌ అధికారులను నియమిం చామని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజ కవర్గంలో అనుమతి లేకుండా తరలిస్తున్న ఎన్నికల ప్రచార సామాగ్రిని సీజ్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేశామని, రాజకీయ పార్టీల ప్రకటనలు ఉన్న బైక్‌, విద్యా సంస్థ బస్‌ల యజమా నులపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించామని తెలిపారు. గురువారం నాటికి వివరాలు చూపని రూ.7,62,850 నగదు సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు గానీ, అభ్యర్థులుగాని ప్రచార వాహనాలు, ర్యాలీలు, సామాగ్రి, సభలకు సువిధయాప్‌ ద్వారా 48 గంటల ముందు దరఖాస్తు చేసుకు ంటే తగిన అనుమతులను మంజూరు చేస్తున్నా మన్నారు. అనుమతులు లేకుండా ప్రచారాలు చేస్తే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు.ఇవిఎంల తరలింపు వాయిదారాష్ట్ర ఎన్నికల సంఘం గుంటూరు నగరపాలక సంస్థకు కేటాయించిన ఇవిఎంలను బాపట్ల జిల్లా నుండి గుంటూరుకు శనివారం తరలించాల్సి ఉండగా, ఈ ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిందని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తరలింపు తేదీ ఖరారైన వెంటనే తెలియజేస్తామని పేర్కొన్నారు.

➡️