నేటి నుండి టెట్‌

Feb 27,2024 00:24

ప్రజాశక్తి-గుంటూరు : టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-2024 (టెట్‌) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుండి మార్చి 6వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 9 పరీక్షా కేంద్రాల్లో, 17258 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు డిఇఒ పి.శైలజ తెలిపారు. 9618454467, 9573382616, 9951394109 నంబర్లలో సంప్రదించాలన్నారు. పేరేచర్లలోని యూనివర్సల్‌ కాలేజి ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, వట్టిచెరుకూరు మండలం, 5వ మైలు కొర్నెపాడు వద్ద ప్రియదర్శినీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, చల్లావారిపాలెంలో బాలాజీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో, చల్లావారిపాలెంలోని శ్రీమేధా టవర్స్‌లో ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌, పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజి, ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజి, పుల్లడిగుంటలోని మలినేని పెరుమాళ్లు ఎడ్యుకేషనల్‌ సొసైటీస్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, నేషనల్‌ హైవేలో, తుమ్మలపాలెం వద్ద గల మిట్టపల్లి కాలేజి ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

➡️