నేడు తిరుపతికి సిఎం

Dec 12,2023 21:43
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌

నేడు తిరుపతికి సిఎం రాకప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధవారం తిరుపతికి రానున్నారు. శ్రీసిటి ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న నేపథ్యంలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్‌ ఎస్‌పి పరమేశ్వర్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం తాజ్‌ హోటల్లో ఏర్పాట్లను పరిశీలించారు. సిఎం బుధవారం సాయంత్రం 5.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడనుంచి 5.30 గంటలకు తిరుపతి తాజ్‌ హోటల్‌కు చేరుకుంటారు. రవిసన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. సాయంత్రం 6.05 గంటలకు తిరిగి గన్నవరం బయల్దేరి వెళతారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో రవిశంకర్‌ రెడ్డి, ఏఎస్పీ లు కులశేఖర్‌, విమల కుమారి, డిఎంహెచ్‌ఓ శ్రీహరి, జిల్లా ఆర్‌ అండ్‌ బి అధికారి సుధాకర్‌ రెడ్డి, జిల్లా ఫైర్‌ అధికారి రమణయ్య పాల్గొన్నారు.ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌

➡️