నేతాజీ ఎంఎస్‌ఆర్‌ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు

Jan 6,2024 18:04
వేడుకల దృశ్యం నేతాజీ ఎంఎస్‌ఆర్‌

వేడుకల దృశ్యం
నేతాజీ ఎంఎస్‌ఆర్‌ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు
ప్రజాశక్తి -నెల్లూరు డెస్క్‌శ్రీ నేతాజీ పైలెట్‌ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిగాయి. విద్యారత్నం శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. విద్యార్థులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల సమక్షంలో 2024 సంక్రాంతి వేడుకలను గ్రామీణ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్‌ వి.మురళీమోహన్‌ రావు పాల్గొన్నారు. భోగిమంటలు ,హరి దాసులు, రంగవల్లులు, కోలాటాలు, సోది చెప్పడం, గంగిరెద్దులను తీసుకు రావడం వంటి కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణంలో గ్రామీణ వాతావరణం తీసుకొచ్చారు. చిన్నారులకు భోగి పండ్లు పోశారు. గ్రామీణ సాంప్రదాయాలకు చెందిన సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులతో పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాల చైర్మన్‌ నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడారు. తమ విద్యార్థులచే జాతీయ పండుగలే కాకుండా వివిధ మత సాంప్రదాయాలకు సంబంధించిన పండుగలను ఆయా సాంప్రదాయాల రీతిలో నిర్వహిస్తుంటామన్నారు. పిల్లల్లో అన్ని మతాల సమానమేనన్న భావనను కలిగించటమే తమ ఉద్ధేశ్యమని తెలిపారు. ముఖ్యఅతిథిగా వాకర్‌ వి .మురళీమోహన్‌రావు భోగిమంటను ప్రారంభించారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్రామ్‌ మాట్లాడారు. సంస్కృతిని కాపాడుకోవాలన్నారు.

➡️