పల్నాడు జిల్లా సరిహద్దుల్లో బోర్డుల ఏర్పాటు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దు బోర్డుల ఏర్పాటు ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా, మండల హద్దులు చూపే సైన్‌ బోర్డులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. మిషన్‌ శోభాకృత్‌లో భాగంగా పల్నాడు జిల్లాలో అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లా, అంతర్‌ మండల సరిహద్దులు బోర్డులు 324 ఏర్పాటు చేశారు. దీనిపై మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయిలో ఆర్‌డిఒల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ బోర్డులు పెడుతున్నారు. రాత్రి సమయంలోనూ కనిపించేలా వీటిని పెడుతున్నారు. 29 అంతర జిల్లా స్థానాల్లో 58 బోర్డులు, 4 అంతర్రాష్ట్ర స్థానాల్లో 8 బోర్డులు, 129 మండలాల పరిధిలో 258 బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉందని కలెక్టర్‌ తెలిపారు.

➡️