పల్లెబాటపట్టణం

పల్లెబాట పట్టింది. తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి. ఇటువంటి ప్రాకృతిక, సాంస్కృతిక పండుగను ఇంటిల్లిపాదీ జరుపుకోనుండడంతో పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా ఖాళీ కావడం పరిపాటి. దేశంలోని ప్రధాన పట్టణాలు, నగర ప్రజానీకం గ్రామ సీమలకు పరుగుపెడుతోంది. ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఎన్నో ప్రాకృతిక మార్పులతో కూడిన పర్వదినం తరాల తరబడి సంప్రదాయంగా వస్తోంది. నవంబర్‌, డిసెంబర్‌ నెలల నుంచే ప్రజానీకం బస్సులు, రైళ్లు, విమాన రిజర్వేషన్లు చేసుకోవడం తెలిసిందే.ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో సంక్రాంతి లకీë పరుగులు పెడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 4,444 గ్రామ సీమలకు నిండుదనాన్ని చేకూర్చింది. తెలుగింట పెద్ద పండుగ కావడంతో దేశంలోని పలు పట్టణాలు, నగరాలు ఖాళీ అవుతున్నా యి. ఈనెల 11 నుంచి పాఠశాలలు సెలవులు ప్రకటించడంతో పట్టణాలు, నగరాల్లోని ఉంటున్న గ్రామీణుల పిల్లలు, ఆత్మీయులు క్రమంగా పల్లెబాట పట్టారు. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నరు, బెంగళూరు, ముంబరు, హైదరాబాద్‌ లాంటి ప్రధాన నగరాల నుంచి పలువురు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. జిల్లా కేంద్రాల్లో ఉంటున్న ఉద్యోగులకు రెండవ శనివారం కూడా కలిసి రావడంతో గ్రామాలకు బయల్దేరారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గ్రామీణుల పిల్లలు సాఫ్ట్‌వేర్లు, ఇంజినీర్‌, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, వివిధ రకాల ఉద్యోగాల్లో ఉంటున్నారు. అందరికీ సంక్రాంతి ప్రధాన పండుగ కావడంతో బస్సులు, రైళ్లు, ఇతర ప్రయివేటు వాహనాలన్నీ రద్డీగా మారాయి. జిల్లాలో జూన్‌ నుంచి జనవరి వరకు వర్షాభావం కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా రైతన్నలు ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా కనిపిస్తోంది. జిల్లా ప్రజారవాణా సంస్థ (ఆర్టీసీ) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 500 సర్వీసులను నడుపుతోంది. ఈ నెల నుంచి 17వ తేదీ వరకు ఆర్టీసీ రాకపోకల షెడ్యూల్‌ను ఆర్‌టిసి రీజినల్‌ మేనేజర్‌ ప్రకటించారు. అయితే ఈదఫా ఛార్జీల పెంపు లేకపోవడం ఊరటను కలిగిస్తోంది. 550 బస్సులతో సంక్రాంతి పండుగకు రావడానికి ఉద్దేశించిన ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఇందులో 190 సూపర్‌లగ్జరీ, 05 ఇంద్రా, 35 అల్ట్రా డీలక్స్‌, 10 ఎక్స్‌ప్రెస్‌ బస్సులను సాధారణ ఛార్జీలతోనే నడు పుతున్నాం. ఇందులోని 90 బస్సులు హైదరాబాద్‌, 80 బెంగళూరు, 30 విజయవాడ, 10 చెన్నరు, 30 ఇతర బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ఆన్‌లైన్‌ డిమాండ్‌ ఆధారంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు తిరుపతి, నెల్లూరు, కర్నూలు వంటి అంతర్‌ జిల్లాలకు అదనపు సర్వీసులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

➡️