పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు

Jan 11,2024 21:27

ప్రజాశక్తి – గరుగుబిల్లి : పాడి రైతులు పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని సద్వి నియోగం చేసుకోవాలని మండలంలోని బురదవెంకటాపురం సర్పంచ్‌ బొత్స లక్ష్మి అన్నారు. మండలంలోని పెద్దూరు రైతు భరోసా కేంద్రం పరిధిలోని బురదవెంకటాపురంలో గురువారం జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా మండల పశుసంవర్ధశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధిటీకాల కార్యక్రమాన్ని సర్పంచ్‌ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఒక్కటే మార్గమన్నా రు. ఈవ్యాధి నివారణకు సంబంధించి పశువులకు టీకాలు వేయడం ఎంతో ఉపయోగమన్నారు. అలాగే వ్యాధిసోకిన పాడి పశువుల్లో తగ్గేపాల ఉత్పత్తిని శాశ్వతంగా నివారించవచ్చన్నారు. కావున రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్యసిబ్బంది ఎ.వెంకటి, తదితరులు పాల్గొన్నారు.150 పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలుకురుపాం : మండలంలోని గుమ్మ పంచాయతీ పరిధిలో గల బొత్తిలిలో గురువారం 150 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు పశుసంవర్ధశాఖ అధికారిని కె.శైలజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువిజ్ఞానబడి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పశువులకు టీకాలు వేయడం జరుతుందన్నారు. అలాగే చలి కాలంలో పశువులు వ్యాధిల బారినపడకుండా ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్‌ నరేంద్ర, గ్రామ వెటర్నరీ అసిస్టెంట్‌ ఉషారాణి, రైతులు పాల్గొన్నారు.

➡️