పశుసంవర్ధక శాఖకు రాష్ట్ర స్థాయి అవార్డు

Feb 2,2024 21:18

ప్రజాశక్తి-విజయనగరం :  పశువైద్యంలో ఉత్తమ సేవలందించినందుకు గాను విజయనగరంలోని పశుసంవర్ధక శాఖ డివిజన్‌కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. విజయవాడలో ఫిబ్రవరి 1న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలో పశువైద్య రంగంలో విశేష సేవలందించిన అధికారులు, ఇతరులకు ప్రశంసాపత్రాలు, అవార్డులు అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా ఈ అవార్డును పశుసంవర్ధక శాఖ విజయనగరం డివిజన్‌ డిప్యూటీ డైరక్టర్‌ ఎవి రమణ అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని కూడా అందజేశారు. ఆ శాఖ డైరక్టర్‌ అమరేందర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️