పాకల తీరంలో ‘కార్తీక’ సందడి

 ప్రజాశక్తి-శింగరాయకొండ : కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర సాన్నానికి మండల పరిధిలోని పాకల సముద్ర తీరానికి ప్రజలు సోమవారం పెద్దఎత్తున తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే శింగరాయకొండ, టంగు టూరు, జరుగుమల్లి మండలాలు, కొండపి, కందుకూరు, కనిగిరి నియోజక వర్గం నుంచి ప్రజలు తరలివచ్చారు. సముద్రంలో స్నానాలు చేసి ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాకల గ్రామంలో శివాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. మెరైన్‌ సిఐ కిషోర్‌ కుమార్‌ , శింగరాయకొండ ఎస్‌ఐ టి. శ్రీరామ్‌ ఆధ్వర్యంలో తీరంలో భారీ బందోబస్తు నిర్వహించారు. మెరైన్‌ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

➡️