పాఠశాలల్లో ‘లిప్‌’ పక్కగా అమలు జరగాలి

Feb 27,2024 21:17

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసానాభివృద్ధి (లిప్‌) పక్కగా అమలు జరగాలని లిప్‌ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. ఉపేంద్ర రెడ్డి సూచించారు. మంగళ వారం స్థానిక డైట్‌ కళాశాలలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో లిప్‌ అమలు, బోధన నిర్వహణ, విద్యార్ధుల విద్యా స్థాయి మెరుగు తీరు తదితర అంశాలపై డైట్‌ అధ్యాపక బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యాస్థాయి మెరుగుకు ఎంఇఒలు, హెచ్‌ఎంలు, డైట్‌ అధ్యాపకులు అవగాహన కల్పించాలని సూచించారు. డైట్‌ నుండి వెళ్ళే పరిశీలకులు ఆయా పాఠశాలల్లో లిప్‌ అమలపై తెలుసుకొని వెళ్లాలని సూచించారు. 6,7, 8 తరగతి విద్యార్థులకు చదవడం, రాయడం స్థాయి కలిగి ఉండేలా బోధనలు చేయాలని సూచించారు. అనంతరం స్థానిక జెడ్‌పి బాలికొన్నత పాఠశాలను సందర్శించి 8వతరగతి విద్యార్థులకు మాదిరి పాఠ్యాంశ బోధన, సోపానాల వారీగా బయాలజీ టీచర్‌ సుజాత ఆధ్వర్యంలో మాదిరి పాఠ్య బోధన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డైట్‌ ఇంఛార్జి ప్రిన్స్‌ పాల్‌ మాణిక్యం నాయుడు, అధ్యాపకులు ఎంఎస్‌ఆర్‌ శర్మ, ప్రవీణ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఏడీ గజపతినగరం: మండలంలోని మరుపల్లి మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ, జడ్పీహెచ్‌ఎస్‌, మండల పరిషత్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర ఎడిషనల్‌ డైరెక్టర్‌ ఏ. సుబ్బారెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో అక్కడికి వచ్చిన ఆయన మూడు హైస్కూల్లోని మధ్యాహ్న భోజన అమలతీరను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతర మధ్యాహ్నం భోజన పథకం రికార్డులను, రిజిస్టర్లను తనిఖీ చేశారు. వీటి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంఇఒలు విమలమ్మ, సాయి చక్రధర్‌, ప్రధానోపాధ్యాయులు నాగమణి పాల్గొన్నారు.సరస్వతి దేవి విగ్రహావిష్కరణమండలంలోని మరుపల్లి ఆదర్శ పాఠశాలలో నూతనంగా నిర్మించిన సరస్వతీ దేవి విగ్రహాన్ని విశాఖపట్నం విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం. జ్యోతికుమారి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మోడల్‌, కేజీబీవీ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రశ్నలు సంధించి సమాధానం రాబట్టుకున్నారు. వర్క్‌ బుక్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒలు ఎస్‌.విమలమ్మ, సాయి చక్రధర్‌, ప్రధానోపాధ్యాయులు నాగమణి, అప్పలనాయుడు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలలు పరిశీలనవేపాడ: మండలంలోని కరకవలస, గుడివాడ, వెళ్దాం ప్రాథమిక పాఠశాలలను విద్యాశాఖ అధికారులు జి జగదీశ్వరరావు, పి. బాల భాస్కర రావులు మంగళవారం పరిశీలించారు. విద్యార్థుల వర్క్‌ బుక్స్‌, తెలుగు, ఇంగ్లీషు, ప్రైమరీస్‌, రాయడం, చదవడం, గణితం లో కూడికలు, తీసివేతలు, టేబుల్స్‌, డైరీలు, ఎండిఎం పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో సిఆర్పిలతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️