పాత క్వారీలో పనులు నిలిపివేత

Mar 28,2024 20:53

ప్రజాశక్తి – భోగాపురం : మండలంలోని రామచంద్రపేట గ్రామస్తుల నిరసనతో ఎట్టకేలకు క్వారీ పనులను నిర్వాహకులు నిలిపివేశారు. క్వారీలో ఉన్న పొక్లైన్లు, డ్రిల్లింగ్‌ చేసే యంత్రాలను నిర్వాహకులు క్వారీలో నుంచి బయటకు తరలించేశారు. గత మూడు రోజుల నుంచి క్వారీ పనులను నిలిపివేయాలని గ్రామస్తులంతా ఏకమై నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. క్వారీ నిర్వాహకుడు అనీల్‌ను కూడా అడ్డుకొని పనులను నిలిపివేయాలని నిలదీయడంతో గురువారం నుంచి క్వారీ పనులు నిలిపివేశారు.గ్రామ పెద్దలతో చర్చించిన సీఐగ్రామంలోని పాఠశాల వెనుక భాగంలో ఇటీవల విమానాశ్రయ నిర్మాణ సంస్థ జిఎంఆర్‌ క్వారీ పనులు చేస్తుండడంతో గ్రామస్తులు మూడు రోజులు కింద అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో భోగాపురం సిఐ ఏ రవికుమార్‌ గ్రామ పెద్దలను బుధవారం సాయంత్రం పిలిపించి మాట్లాడారు. అనుమతులు పొంది క్వారీ పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని సిఐ వారిని ప్రశ్నించారు. ఉన్నవాటితో ఇబ్బంది పడుతున్నామని మళ్లీ ఇప్పుడు కొత్తగా క్వారీ ఏర్పాటు చేస్తే చాలా ఇబ్బందులకు గురవుతామని గ్రామ పెద్దలు సిఐకి తెలిపారు.అడ్డుకుంటే చర్యలు తీసుకుంటాం: సిఐప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసినప్పటికీ గ్రామస్తులు అడ్డుకుంటున్నట్లు జిఎంఆర్‌ సంస్థ ఫిర్యాదు చేసింది. వారికి మంజూరు చేసిన అనుమతులు పరిశీలించి గ్రామస్తులతో చర్చించడం జరిగింది. ఏమైనా ఇబ్బంది ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలి. కానీ పనులను అడ్డుకుంటే వారిపై కచ్చితంగా కేసులు నమోదు చేస్తాం.ఎ. రవికుమార్‌, సిఐ, భోగాపురం

➡️