పూర్తిస్థాయిలో వినతులు పరిష్కరించండి

ప్రజాశక్తి – పార్వతీపురం : జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వచ్చిన వినతులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టరు అర్‌.గోవిందరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జెసితో పాటు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు, కెఆర్‌సిసి డిప్యూటీ కలెక్టరు కేశవనాయుడుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 120 అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందనపార్వతీపురం రూరల్‌ : పార్వతీపురం మన్యం జిల్లా ఎస్‌పి కార్యాలయంలో సోమవారం అదనపు ఎస్‌పి దిలీప్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించి పలు గ్రామాల నుంచి వచ్చిన సందర్శకుల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. వేధింపులు, కుటుంబ కలహాలు, సివిల్‌ తగాదాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదు దారులు విన్నవిం చుకోగా, వారి సమస్యలపై ఎఎస్‌పి సానుకూలంగా స్పంది ంచి, సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అంది ంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకర్‌ రావు, సిబ్బంది పాల్గొన్నారు.సమస్యలు పరిష్కరించండిసీతంపేట: సమస్యలు పరిష్కరించాలని పలువురు గిరిజనులు వినతులు సమర్పించారు. సోమవారం స్పందన కార్యక్రమం పిఒ కల్పనకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాండ్ర మానుగూడకు చెందిన రమేష్‌ పట్టా మంజూరు చేయాలని కోరారు. చింతల గూడకు చెందిన తురకన్న ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ కట్ట మంజూరు చేయాలని, చిన్న గోరకాలనికి చెందిన కామేశ్వరరావు విద్యుత్‌ స్తంభాలు వేయాలని, లోవ గూడ కాలనీకి చెందిన వెంకటరావు చెరువు మరమ్మత్తులు చేయాలని వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ రోషిరెడ్డి, డిడి మంగవేణి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సింహాచలం, డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, సిడిపిఒ రంగలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయ పార్వతి, పి హెచ్‌ఒ గణేష్‌, పిఎఒ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️