పెంపకందారులకు అండగా ఉంటా: పాలేటి

ప్రజాశక్తి-చీరాల: గొర్రెలు మేకల పెంపకందార్ల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జీవాలకు అవసరమైన మందులను సక్రమంగా సరఫరా చేయడం లేదని, పెంపకందారుల గ్రూపులకు రుణాలు ఇవ్వకుండా ఆపేశారని గొర్రెలు మేకలు పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి విమర్శించారు. సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ సందర్భంగా పెద్దబ్బాయి మాట్లాడారు. ఈ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పాలేటి రామారావు హాజరయ్యారు. ఆయన మాట్లాడు తూ తనకు ఆత్మీయులైన వారి క్యాలెండర్‌ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గొర్రెలు మేకలు పెంపకందారులకు అండగా ఉంటానని రామారావు అన్నారు. సంఘ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ బుర్రి ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో పెంపకం దారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి త్వరలో జిల్లాలోని పెంపకందారులతో సమావేశం జరిపి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. సమావేశంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కుర్ర రామారావు, చీరాల మండల నాయకులు మసన వెంకటేశ్వర్లు, దెబ్బకుడి ఎలమంద బుర్ల శీను వెంకట్రావు, మల్లార వెంకటేశ్వర్లు వడ్లమూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️