పేదలకు చీరలు, బియ్యం పంపిణీ

ప్రజాశక్తి-సంతనూతలపాడు: సంతనూతలపాడు మాజీ ఎంపిడిఒ, తెలుగుదేశం పార్టీ నాయకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి కీర్తిశేషులు షేక్‌ బికారి ఐదవ వర్థంతి సందర్భంగా ఆయన చిన్న కుమార్తె షేక్‌ హసీనా బేగం, సేవా సంకల్ప్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం 100 మంది పేదలకు బియ్యం, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జెవివి జిల్లా నాయకులు కోదాటి కోటేశ్వరరావు, బరహమతుల్లా, మాజీ సర్పంచ్‌ మన్నం రంగనాయకమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ తన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి జీవితంలో స్థిరపడి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్‌ సభ్యులను అభినందించారు. ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆశీర్వదించారు. బారహమతుల్లా మాట్లాడుతూ దివంగత షేక్‌ బికారి ఎంపిడిఒగా పని చేస్తున్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, కళా రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో షేక్‌ హసీనాబేగం, ట్రస్ట్‌ చైర్మన్‌ ఎస్‌ వెంకటరమణ, సభ్యులు వెంకటేశ్వర్లు, నారాయణస్వామి చౌదరి, శిఘాకొల్లి శ్రీను మల్లారెడ్డి, రాంగోపాల్‌, కవిత, ధనలక్ష్మి, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.

➡️