పేదల ధర్మాగ్రహమే ‘సామాజిక సత్యాగ్రహం’

ప్రజాశక్తి-మదనపల్లి ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లుగా పేద ప్రజలకు చేస్తున్న దగాపై వ్యక్తమవుతున్న ధర్మాగ్రహమే తాము చేపట్టిన సామాజిక సత్యాగ్రహయని విసికె పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటిఎం శివప్రసాద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక బాస్‌ కార్యాలయంలో విసికె పార్టీ నాయకులతో కలిసి సామాజిక సత్యా గ్రహం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెత్తందార్ల రాజ్యం నడు స్తోందని, పేద, మధ్యతరగతి వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని, సహజ వనరులను యథేచ్ఛగా ఈ ప్రభుత్వం లూఠీ చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూర్చే, పథకాలను ఈ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందన్నారు. జగనన్న గోరుముద్ద అని గొప్పగా చెప్పుకొనే పథకంలో రోజుకు రూ.34లతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారని, రూ.34లతో మూడు పూటలు ఆ పిల్లలు కడుపునుండా తిండి తినగలరా? అని ప్రశ్నించారు. పేద పిల్లలంటే జగన్‌ సర్కారుకు చిన్నచూపని, అందుకే ప్రభుత్వ వసతీగ హాల్లోని విద్యార్థుల పట్ల నిర్ధయగా వ్యవహరిస్తోందని చెప్పారు. జగన్‌ ప్రభుత్వంలో నాలుగున్నర ఏళ్లుగా పేద, మధ్యతరగతి వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన వ్యక్తం చేయడానికే విసికె పార్టీ, భారతీయ అంబేడ్కర్‌ సేన (బాస్‌) సంయుక్తంగా ఆదివారం మదనపల్లిలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సామాజిక సత్యాగ్రహం పేరుతో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ఆదివారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ సాగే ఈ సత్యాగ్రహంలో వీసీకే పార్టీ మరియు బాస్‌ ప్రతినిధులతోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, ప్రగతిశీల సంఘాల నాయకులు పాల్గొని విజయ వంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాస్‌ జిల్లా కన్వీనర్‌ ముత్యాల మోహన్‌ తోపాటు విసికె, బాస్‌ నాయకులు పెద్దపాలెం రవిశంకర్‌, రాయల్‌ సూరి, బురుజు రెడ్డిప్రసాద్‌, తలారి కృష్ణ, వై.గంగాధర్‌, వై.చిన్నా, బురుజు జనార్దన్‌, వెంకట్‌, రవి, డి.మోహన్‌ పాల్గొన్నారు.

➡️