పేదల సంక్షేమానికి కృషి : చెవిరెడ్డి

ప్రజాశక్తి-మార్కాపురం : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వైసిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సెవెన్‌హిల్స్‌ హోటల్‌ లో వైసిపి కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ చెప్పినవీ చేశాం… చెప్పనవీ చేశామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు. గతంలో హామీ ఇవ్వని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల రూ. 475 కోట్లతో నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మార్కారం నియోజక వర్గ అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు, వైసిపి యర్రగొండపాలెం అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌, ఎపిఐఐసి చైర్మన్‌ జంకె వెంకటరెడ్డి, ముస్లిం మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషీర్‌అలిబేగ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీక్రిష్ణ, వైసిపి పట్టణ కన్వీనర్‌ షేక్‌ ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️