పేదల సొంతింటి కల సాకారం

Jan 6,2024 21:05

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : పేదల సొంతింటి కల జగనన్నతోనే సాకారం అవుతుందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం మున్సిపల్‌ పరిధిలో 17, 18 వార్డులకు చెందిన హౌసింగ్‌ లబ్ధిదారులకు బెలగాంలో ఉన్న సచివాలయంలో ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నర్సిపురం జగనన్న లేఅవుట్‌లో స్థలాలు వచ్చిన లబ్ధిదారులకు ఆ లేఅవుట్‌ రద్దు కావడంతో వెంకంపేట ప్రాంతంలో లేఅవుట్‌లో మంజూరు చేసినట్లు తెలిపారు. అక్కడ ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వార్డుల వారీగా పట్టాలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.గౌరీశ్వరి, వైసిపి పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్‌లీడర్‌ మంత్రి రవికుమార్‌, సచివాలయ కన్వీనర్లు జి.పద్మజ, ఎం.తవిటినాయుడు, కౌన్సిలర్‌ ఆర్‌.చిన్నంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️