పోలంరెడ్డివి అవగాహన లేని వ్యాఖ్యలు

Feb 2,2024 21:35
ఫొటో : శిలాఫలకం ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

ఫొటో : శిలాఫలకం ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
పోలంరెడ్డివి అవగాహన లేని వ్యాఖ్యలు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదువుతూ అవగాహన లేకుండా పొలంరెడ్డి దినేష్‌ రెడ్డి మాట్లాడడం సరికాదని ఎపిఎల్‌డిఎ చైర్మన్‌ గొల్లపల్లి విజయకుమార్‌ పేర్కొన్నారు. శుక్రువారం ఇందుకూరుపేట మండలంలోనీ ముదిరవర్తిపాలెం కాజ్‌వే నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ నలపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మట్లడుతూ కేంద్ర, రాష్ట్ర నిధులకు తేడతెలినవారు ఎంఎల్‌ఎ అభ్యర్థులు కావడం కోవూరు ప్రజల దురదృష్టకరమన్నారు. అనంతరం ఎపిఎల్‌డిఎ చైర్మన్‌ గొల్లపల్లి విజయకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ కోవూరు టిడిపి ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. ప్రసన్న కుమార్‌ రెడ్డి శంకుస్థాపనలు చేసిన ప్రతీ పనిని పూర్తి చేసామన్నారు. ఉదాహరణకు రావూరూ రోడ్డు, పన్నూరు రోడ్డు, పెన్నాపోర్లు కట్టలు వంటి ఎన్నో పనులను మండలంలో చేశామన్నారు. అసలు శిలాఫలకాలే లేకుండా మైపాడు టూ నెల్లూరు రోడ్డు, గంగపట్నం చెరువు, ఎన్నో కాలువల పూడికతీతలు వంటి అభివృద్ధి పనులు చేసామన్నారు. మైపాడు చెరువు నరసాపురం, సోమరాజు పల్లి, కోరుటూరూ గ్రామాలకు సంబంధించిన శిలాఫలకం నరసాపురంలో చెరువు పక్కనే వేశామని అది కూడా అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. అలాగే మైపాడు చెరువు పనులకు సంబందించి లోటస్‌ కాంపెనీ వారు 2020లో టెండర్‌ వేసి 2021 వరకు రూ.60 లక్షల పనులు చేశారని, అనంతరం కరోనా రావడంతో పనులు ఆగిపోయాయాని, దానిని కూడా ప్రజలను పక్కదారి పంట్టించేందుకు తమ నాయుకులపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, యువనేత దువ్వూరు కళ్యాణ్‌ రెడ్డి, గుణుపాటి సురేష్‌ రెడ్డి, నల్లపరెడ్డి రజితరెడ్డి, జెడ్‌పి వైస్‌చెర్మన్‌ శ్రీహరికోట జయలక్ష్మీ, డిసిఎంఎస్‌ చైర్మన్‌ వీరిచలపతి, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️