పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు

Mar 27,2024 21:23

ప్రజాశక్తి- బొబ్బిలి : పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి చెప్పారు. పట్టణంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను ఆమె బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు ఇబ్బందులు పడకుండా చూడాలని ఇంజినీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. మరమ్మతులు ఉంటే బాగు చేయాలని సూచించారు. మౌలిక సౌకర్యాలు కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఆమెతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వరప్రసాద్‌, ఎఇ సురేష్‌ తదితరులు ఉన్నారు.ఓటు హక్కును వినియోగించుకోవాలిబాడంగి: రాజ్యాంగం ద్వారా ఎన్నికల సంఘం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ ఆంజినేయులు, తహశీల్దార్‌ రాజారావు అన్నారు. బుధవారం పాళ్తేరు, వాడాడ గ్రామంలో ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అధికార్లు మాట్లాడుతూ 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిందని, అప్పటి నుంచి దేశంలో ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుండి పిఒలకు శిక్షణలక్కవరపుకోట: సాధారణ ఎన్నికలలో విధులు నిర్వహించేందుకు మండల వ్యాప్తంగా ఉన్న ఎస్జిటి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న 74 మంది ఉపాధ్యాయులను పిఒలుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ నుండి ఆదేశాలు వచ్చినట్లు స్థానిక ఎంఇఒలు సిహెచ్‌ కూర్మారావు, ఎం శ్రీనివాసరావులు బుధవారం తెలిపారు. వీరికి ఈ నెల 28న ఎస్‌కోట జూనియర్‌ ప్రభుత్వ కళాశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వేపాడ: మండలంలోని పాటూరు, బొద్దాం గ్రామంలో ఎన్నికల సందర్భంగా ముందస్తు చర్యలో భాగంగా గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు ప్రజలతో పోలీసులు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం డిఎస్‌పి గోవింద మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, యువకులు, ఎస్‌కోట సిఐ, వల్లంపూడి ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

➡️