చెట్లు పెంచుదాం!

Apr 28,2024 04:15 #jeevana

పెరుగుతోంది పెరుగుతోంది భూతాపం
కరుగుతోంది కరుగుతోంది హిమాచలం
కదం తొక్కి కదలాలీ యువతరం
పదం కలిపి పాడాలి యువగళం

ఉదాసీనతనే వదిలి పెట్టుదాం
ఉదారంగు మొక్కలనే నాటుదాం
చలిమరల వాడకాన్నే తగ్గిద్దాం
చల్లని తరుల ఛాయనే శయనిద్దాం

చెట్లే కదా మన జీవన ఆధారం
చెట్లే కదా మన ప్రగతి సోపానం
చెట్లే కదా మన జగతి ఆహ్లాదం
చెట్లే కదా మన ఆరోగ్య రహస్యం

అందుకే …
నేడే మనం ప్రతిన పూనుదాం
వృక్షో రక్షతి రక్షిత్ణ అని నినదిద్దాం!

– గుండాల నరేంద్ర బాబు,
94932 35992.

➡️