పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి : ఎంపీపీ దండు

Mar 3,2024 15:49 #West Godavari District

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గణపవరం మండల పరిషత్‌ అధ్యక్షులు దండు వెంకటరామరాజు పిలుపునిచ్చారు. పల్స్‌ పోలియో సందర్భంగా ఆదివారం అర్థవరంలో ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పోలియో చుక్కలు వేయడానికి 32 కేంద్రాలు ఒక మొబైల్‌ టీం ముగ్గు సూపర్వైజరును ఏర్పాటు చేసినట్లు డాక్టర్‌ సంతోష్‌ నాయుడు తెలిపారు. తమ ఆసుపత్రి పరిధిలో 3475 మందికి పోలియో చుక్కలు వేయవలసి ఉండగా 3341 మందికి పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. గణపవరం ఎంపీపీ పాఠశాల వద్ద సూర్య బలిజ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ శెట్టి అనంతలక్ష్మి, గణపవరం సచివాలయం వద్ద సర్పంచ్‌ మోర అలంకారం, సరిపెల్లి పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్‌ సిహెచ్‌ లక్ష్మీ భవాని, కొత్త పల్లిలో సర్పంచి మద్దాల రత్నకుమారి, గణపవరం నాలుగో సచివాలయం వద్ద ఉపసర్పంచ్‌ దండు రాము, మూడవ సచివాలయం వద్ద ఎంపీటీసీ బత్తి సీతామాలక్ష్మి, కొమ్మర పంచాయతీ వద్ద సర్పంచి కొండేటి వెంకటరత్నం పోలియో చుక్కలు వేశారు, ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ జాలాది విల్సన్‌ బాబు హెచ్‌వి పద్మజ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు అంగన్వాడీి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️