పోలీసు శిక్షణ కేంద్రంలో మౌలిక వసతుల పరిశీలన

Mar 2,2024 20:11

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా త్వరలో జిల్లాకు రానున్న కేంద్ర బలగాలు బస చేసేందుకు కల్పించాల్సిన మౌలిక వసతులను పరిశీలించేందుకు ఎస్‌పి ఎం.దీపిక శనివారం సారిపల్లి లోని జిల్లా శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. శిక్షణ కేంద్రంలో గదులను, మంచాలు, నీటి వసతులు, మంచినీటి సౌకర్యం, వంట గదులు, భోజనశాలను పరిశీలించి, కేంద్ర బలగాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌పి వెంట అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్‌, ట్రైనీ ఐపిఎస్‌ మండ జావలి అల్ఫాన్స్‌, డిటిసి డిఎస్‌పి వీరకుమార్‌, విజయనగరం డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు, ఎఆర్‌ డిఎస్‌పి యూనివర్స్‌, ఎస్‌బి సిఐ ఇ.నరసింహ మూర్తి, 2వ పట్టణ సిఐ కె.రామారావు ఉన్నారు.

➡️