పౌష్టికాహార పక్షోత్సవాలపై అవగాహనా ర్యాలీ

Mar 12,2024 16:53 #anaganwadi, #chitoor

ప్రజాశక్తి-పుత్తూరుటౌన్‌ : పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంలో 9 నుంచి 23 వరకు వివిధ కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించడం జరుగుతుందని పుత్తూరు ప్రాజెక్టు అధికారి పద్మజ తెలిపారు. మంగళవారం మండలంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. మనవహరం చేపట్టారు. సిడిపిఓ పద్మజ, కేయం అగ్రహారం పరమేశ్వర మంగళం, ఎం బి రోడ్డు అంగన్వాడీ కేంద్రాలకు హాజరై తల్లులకు పౌష్టికాహారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పిల్లలకు చిరుధాన్యాలు ఇవ్వాలన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య శిబిరాలు, నిర్వహించాలని, పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ముని కుమారి, ధనమ్మ, హైమావతి. సూపర్వైజర్లు. కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️