ప్రిజం-10పై అవగాహన కల్పించాలి

Mar 28,2024 21:10

ప్రజాశక్తి – వీరఘట్టం:  ప్రిజం-10పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బగాది జగన్నాథరావు సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. ఎఎన్‌ఎంలకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చొరవ చూపాలన్నారు. ఎండలు అధికంగా ఉండడం వల్ల వడదెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉందని, వాటికి సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వీలైనంత మేరకు గ్రామస్థాయిలో వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మందులు స్టోర్‌ రూమ్‌, సిబ్బంది రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు స్థానిక వైద్యాధికారి పి.ఉమామహేశ్వరి, ఇఒ కె.జనార్దన్‌రావు, సూపర్వైజర్‌ ఓ.శాంతి కుమారి, డిఇ యోగేశ్వర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

➡️