ఫీడర్‌ అంబులెన్స్‌ ఉద్యోగులసమస్యలు పరిష్కరించాలి 

Dec 10,2023 21:37

 ప్రజాశక్తి-పాచిపెంట  :   ఫీడర్‌ అంబులెన్స్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు అభిమన్యుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలో ఆదివారం వారు ఫీడర్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌తో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించేందుకు ఫీడర్‌ అంబులెన్సులను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 200 మందికి పైగా ఫీడర్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు ఉన్నారని తెలిపారు. ఫీడర్‌ అంబులెన్స్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అంబులెన్స్‌ మరమ్మతులకు గురైతే ప్రభుత్వమే బాగుచేయాలని కోరారు. మెరుగైన వేతనాలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

➡️