బాగా చదవండి..పరీక్షలకు సిద్ధం కండి.. : ఎస్‌ఎఫ్‌ఐ

Jan 23,2024 16:05 #SFI, #vijayanagaram
  •  ఫిబ్రవరి 4న జరిగే ప్రజ్ఞా వికాసం పరీక్ష

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎస్‌ఎఫ్‌క్ష్మి ఆధ్వర్యంలో10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ్ఞా వికాసం పరీక్ష పిబ్రవరి 4 తేదిన నిర్వహిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, విహెచ్‌ వెంకటేష్‌లు తెలిపారు. మంగళవారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పరీక్షలు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పరీక్షలో ఇందులో పాల్గొని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రైజ్‌ మనీ జిల్లా మొదటి స్థానంకు రూ.5,000/- జిల్లా రెండవ స్థానానికి రూ.3,000/- జిల్లా మూడవ స్థానానికి రూ.2,000/- బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మండల స్థాయిలో 300మంది రాస్తే మొదటి మూడు స్థానాలకు మెమొంటోలు ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష రాసే విద్యార్థులు ఫిబ్రవరి 01వ తేది లోపు ఫీజు రూ.25/- చెల్లించి మీ పేర్లు నమోదు చేసుకొని హాల్‌ టిక్కెట్టు తీసుకోవాలన్నారు. పరీక్షల ముందు సినిమా, ఫోన్‌, సీరియల్స్‌, క్రికెట్లకు దూరంగా ఉండలన్నారు. సమయాన్ని వృథాచేయకుండా ఒక ప్రణాళికను రూపొందించుకొని బాగా చదవాలని విద్యార్థులకు సూచించారు. పబ్లిక్‌ పరీక్షలకు ముందు ఇటువంటి పరీక్షలు నిర్వహించి విద్యార్థులలో ఉన్న భయాందోళనలను పోగొట్టి విద్యార్థులలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడం కోసం కషి చేస్తుందన్నారు. ఈ ప్రజ్ఞా పరీక్షసబ్జెక్ట్‌ వారీగా మార్కులు : మేథ్స్‌-20, సోషల్‌ స్టడీస్‌-20, ఇంగ్లీషు-20, ఎన్‌.ఎస్‌-10, పి.ఎస్‌-10, తెలుగు-10, హిందీ-10 మొత్తం కలిపి 100 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటాయి. ఓ ఎమ్మార్‌ షీట్‌ పై బబ్లింగ్‌ విధానంలో బాల్పెన్తో బబ్లింగ్‌ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సౌమ్య పాల్గొన్నారు.

పరీక్ష రాసే విద్యార్థులు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు

విజయనగరం
93817 68275
75692 90549
ఎస్.కోట
79951 07340
62810 56384
గజపతినగరం
96762 20612
77804 69115
బొబ్బిలి
95025 07945
79818 81073
చీపురుపల్లి99858 25957,
85228 57986
నెల్లిమర్ల
79935 17081
72888 49236
రాజాం76800 25790
జిల్లా కేంద్రంలో
98663 02963
63029 78953
97055 45164
94924 14763

➡️