భక్తి శ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే వేడుకలు

ప్రజాశక్తి – ముద్దనూరు మండలంలోని అన్ని చర్చిలలో క్రైస్తవులు శుక్రవారం గుడ్‌ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. స్థానిక సిఎస్‌ఐ, ఎస్‌పిజి,(సిఎస్‌ఐ) ఆర్‌సిఎం, మన్నా, హెబ్రోన్‌, హాసన్నా,శాల ప్రార్ధనా మందిరాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎల్‌ఎమ్‌ కాంపౌండ్‌లోని సిఎస్‌ఐ చర్చిలో రెవరెండ్‌ పాస్టర్‌ దేవసహాయం, నాలుగు రోడ్ల సమీపంలో ఉన్న సిఎస్‌ఐ(ఎస్పీజీ) చర్చిలో రెవరెండ్‌ పాస్టర్‌ సంతోష్‌ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్‌ ఫ్రైడే ప్రాముఖ్యతను ఏసు క్రీస్తు శిలువలో పలికిన మాటల గురించి వివరించారు. ఆర్‌సిఎం పాస్టర్‌ మర్రెడ్డి ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు, వివిధ వేషధారణలతో సిలువను మోస్తూ క్రైస్తవులు పుర వీధుల్లో తిరిగారు. అనంతరం ఎల్‌ఎమ్‌ కాంపౌండ్‌లో భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. పులివెందుల రూరల్‌ : పట్టణంలో గుడ్‌ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గోటూరు చిన్నప్ప ఆధ్వర్యంలో ఆర్‌సిఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడే దాదాపు 550 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఫాదర్‌ ప్రకాష్‌, సెయింట్‌ ఆన్స్‌ కాన్వెంట్‌ సిస్టర్స్‌ , స్టేట్‌ డైరెక్టర్‌ గంగాధర్‌ రెడ్డి, రాజారెడ్డి, చంద్రమౌళి, మౌళి, డేని, వెంకట్‌ నాథ్‌ రెడ్డి, శీను, రఫీ, పవన్‌, బాబు, చర్చి సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు. కడప అర్బన్‌ : కడప నగరంలోని డాన్‌ బోస్కో ఐటిఐ నుంచి ఆరోగ్యమాత చర్చి వరకు, ఆంతోని నగర్‌ నుంచి మాసా పేట సర్కిల్‌ మీదుగా చర్చి వరకు 14 గట్టాల సిలువ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సహాయ డైరెక్టర్‌ ఫాదర్‌ సన్‌ ఫాదర్‌ నాగిపోకు బాబు, ఫాదర్‌ సల్ల మనోహర్‌ ఆరోగ్యమాత, జేఎంజె చర్చి పెద్దలు, శాంతి సేవా సొసైటీ వ్యవస్థాపకులు మడగలం ప్రసాద్‌, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.

➡️