మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలి

Feb 14,2024 21:11

ప్రజాశక్తి- శృంగవరపుకోట : మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉండేందుకు బలోపేతం చెయ్యడం కోసం అక్క చెల్లమ్మలకు ఇచ్చిన మాట తప్పకుండా స్వయం సహాయక సంఘాలకి 4వ విడత రుణమాఫీలు చేసిన ఘనత జగనన్నకు తొక్కుతుం దని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని ఆకుల డిపో ప్రాంగణంలో బుధవా రం నిర్వహించిన వైయస్సార్‌ ఆసరా సంబరాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో మొత్తం 1312 స్వయం సహాయ సంఘాలలో గల 14,255 మంది మహిళలకు సుమారుగా రూ.7.82కోట్లు మంజూరు చేశామన్నారు. మల్లీ జగనన్నని సీఎంగా గెలిపించుకోడానికి మనం అందరం సిద్దంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ వేచలపు చినరాము నాయుడు, స్టేట్‌ ఫోక్‌ అండ్‌ కల్చరల్‌ డెరైక్టర్‌ వాకాడ రాంబాబు, జామి, ఎస్‌కోట వైసిపి మండల అద్యక్షులు గొర్లె రవి, మోపాడ కుమార్‌, వైస్‌ ఎంపిపి పినిశెట్టి వెంకటరమణ, ఎస్‌.కోట పట్టణ అధ్యక్షుడు రెహమాన్‌, పోతనాపల్లి సర్పంచ్‌ కూనిరెడ్డి వెంకటరావు, కొట్టం శానాపతి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

➡️