మహిళా రైతుకు 33సెంట్లు అప్పగింత

Jan 7,2024 20:57

ప్రజాశక్తి – భోగాపురం: భోగాపురం గ్రామానికి చెందిన మహిళా రైతుకు న్యాయం చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభిం చారు. దీనిలో భాగంగా ఇటీవలి 33సెంట్లు భూమికి కొలతలు వేసి హద్దులు చూపించామని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయానికి వెళ్లేందుకు రహదారి కోసం 2017లో భూసేకరణ చేశారు. భోగాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు మాత శిరోమణికి చెందిన 27సెంట్లు భూమికి అప్పట్లో పరిహారం అందజేశారు. ఇటీవలి జీఎమ్మాఆర్‌ సంస్థకు రెవెన్యూ అధికారులు ఈ భూమిని అప్పగించారు. అయితే జిఎంఆర్‌ సంస్థ పరిహారం ఇచ్చిన భూమితో పాటు మరో 40 సెంట్లు భూమిలో నుంచి కొత్తగా సరిహద్దు రాళ్లు వేశారు. దీంతో ఆ మహిళా రైతు సుమారు కోటి రూపాయలు విలువైన 40 సెంట్లు భూమి కోల్పోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో పరిహారం కోసం అధికా రులు చుట్టూ తిరిగినప్పటికి స్పందించలేదు. ఇటీవలి ప్రజాశక్తిలో అధికారుల తప్పిదం రైతుకు శాపం అనే ప్రత్యేక కథనం వెలువడడంతో అధికారులు స్పందించారు. 2017లో భూసేకరణ చేసేటప్పుడు మహిళా రైతు పక్కనున్న మరో రైతుకు నష్ట పరిహారం వేసినట్లు గుర్తించారు. సంబంధిత రైతుకు విచార ణకు రావాలని రెవెన్యూ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికి నేరుగా చెప్పినప్పటికి హాజరు కాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన జిల్లా అధికారులు స్థానిక అధికారులతో పాటు సర్వేర్లను పంపించి సంబంధిత రైతు భూ మిలో ఇటీవలి కొలతలు వేశారు. 33సెంట్లు భూమికి కొల తలు వేసి మహిళా రైతుకు హద్దులు చూపించారు. అయితే ఇంకా అధి కారకంగా ఉత్తర్వులు ఇవ్వలేదని మహిళా రైతు చెబుతున్నారు. అధికారులు ఆన్‌లైన్‌ చేసి ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. భూమి అప్పజెప్పాంనష్టపరిహారం మరో రైతుకు పడినట్లు గుర్తించాం. దీనిపై సంబంధిత రైతుకు నోటీసులు ఇచ్చి హాజరుకావాలని తెలిపాం. కాని సంబంధిత రైతు హాజరుకాలేదు. దీనితో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆ రైతుకు చెందిన భూమికి కొలతలు వేసి మహిళా రైతుకు 33సెంట్లు అప్పజెప్పాం ముటేషన్‌ కోసం దరఖాస్తు చేస్తే మహిళా రైతు పేరు మీద ఆన్‌లైన్‌ చేస్తాం. – చింతాడ బంగార్రాజు, తహశీల్దారు, భోగాపురం

➡️