మహిళా సంక్షేమానికి పెద్దపీట : నిషార్‌

అహ్మద్‌ప్రజాశక్తి-నిమ్మనపల్లి డ్వాక్రా సంఘాలలోని మహిళల సంతోషమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త నిషార్‌అహ్మద్‌ అన్నారు. శనివారం నిమ్మనపల్లి జడ్‌పి ఉన్నతపాఠశాల(తెలుగు) మైదానంలో నిర్వహిం చిన వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగవ విడత నిధుల పంపిణీ కార్యక్ర మానికి మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, ఎపిఎండిసి రాష్ట్ర చైర్మన్‌ షమీం అస్లాం, ఎంపిపి నరసింహులు, మదనపల్లి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ తట్టి శ్రీనివాసు లురెడ్డి, స్థానిక నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు. ఇప్పటివరకు మూడు విడతలలో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ వచ్చారని, ప్రస్తుతం నాలుగవ విడతలోనూ మండలంలోని 591 స్వయం సహాయక సంఘాలలోని 5202 మంది సభ్యులకు రూ.5.12 కోట్లను అందించారని అన్నారు. సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మంజూరు చేసి, ప్రభుత్వమే స్వయంగా రిజిస్ట్రేషన్‌ చేసి, లబ్ధిదారులకు ఆ ఇంటిపై సర్వ హక్కులు కల్పించిందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌ మాయ మాటలు చెప్పి మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తారని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరని వారికి అన్నారు. సంక్షేమ పాలన కోసం మరోమారు వైసిపిని ఆదరించాలని కోరారు. వాలంటీర్ల సేవలు మరువలేనివని అన్నారు. మండల పరిధిలో 167 మంది వాలంటీర్లు పనిచేస్తుండగా, తవళం గ్రామానికి చెందిన వాలంటీరు బి.శశికళ కు సేవ వజ్రా పురస్కారం అందగా, ఎం. సౌజన్య నిమ్మనపల్లె-2, సి.గీత రెడ్డివారిపల్లి-1, బి.గౌతమి సామకోటవారిపల్లె, జి.సుకన్య తవళం వాలంటీర్లకు సేవారత్న పురస్కారాలు, మిగిలిన వాలంటీర్లకు సేవా మిత్ర పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనర్‌ సదాశివరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఆర్‌ఐ రమణారెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, ఆర్‌బికె చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వైస్‌ ఎంపిపిలు జయప్రకాశ్‌రెడ్డి, సుజాత, ఎంపిడిఒ మైథిలి, ఎపిఎం రజనీకుమారి, వైసిపి సీనియర్‌ నాయకులు సాయిప్రతాప్‌రెడ్డి,కొమ్మేపల్లి శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, సంఘమిత్రలు పాల్గొన్నారు.

➡️