మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఘన నివాళి

ప్రజాశక్తి-కృష్ణా : మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రథమ వర్ధింతిని పురస్కరించుకొని టిడిపి నాయకులు కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు బండిరామకృష్ణ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలకు పెట్టింది పేరుగా బచ్చుల అర్జునుడు రాజకీయ ప్రస్థానం కొనసాగిందన్నారు. ఆయన లేని లోటు పార్టీకి తీరనిదన్నారు. అర్జునుడు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. బచ్చుల అర్జునుడు వారసుడిగా వారి తనయుడు బచ్చుల బోస్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ప్రభుత్వం రాగానే రాష్ట్రస్థాయిలో ఉన్నతమైన పదవి రావడానికి తన వంతు కృషి చేస్తానని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ఇన్చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ.. రాజకీయాల్లో మచ్చ లేనటువంటి జీవితాన్ని గడిపిన బచ్చుల అర్జునుడు ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. వారి లేని లోటు కుటుంబానికే కాకుండా సమాజానికి తీరనిదన్నారు. కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర హౌసింగ్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ మరకాని పరబ్రహ్మం, కార్పొరేటర్‌ దేవరపల్లిఅనిత, కార్పొరేటర్‌ సమత కీర్తి,జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డంరాజు జనసేన టిడిపి నాయకులు కొట్టే వెంకట్రావు, చౌదరి,పివిఫణి కుమార్‌, గోకుల్‌, శివ,మహేష్‌,ఆరేపుసాయి, విద్యాసాగర్‌ బచ్చుల అర్జునుడు కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.

➡️